వినాయక నిమజ్జనంలో అపశ్రుతి


Sat,September 7, 2019 11:44 PM

-కోర్పోల్ నీట మునిగి వ్యక్తి మృతి
పుల్కల్: మండల పరిధిలోని కోర్పోల్ గ్రామంలో వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకున్నది. అప్పటి వరకు వినాయకుడి ఎదుట ఆడుతున్న వ్యక్తి నీట మునిగి గల్లంతుకావడంతో శోభాయాత్ర శోకసంద్రమైంది. ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపిన కథనం ప్రకారం మండలంలోని కోర్పోల్ గ్రామంలో గొల్ల సంఘం దగ్గర చిన్నారులు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐదు రోజుల పూజల అనంతరం శుక్రవారం రాత్రి వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపుగా బయలు దేరారు. రాత్రి చిన్నారులకు చెరువుకు వెళ్లి నిమజ్జనం చేయడం ఇబ్బంది కావడంతో శనివారం ఉదయం నిమజ్జనానికి బయలు దేరారు. ముందుగా వినాయకుడి నిమజ్జనం చేసే స్థలంలో నీటి లోతు ఎంత ఉందోనని చెరువులోకి కర్నే ఆంజనేయులు(38)నీటిలోకి దిగాడు.

చెరువులో జేసీబీ తవ్విన గుంతలున్నాయి. గుంతలను గమనించని ఆంజనేయులు చెరువులోకి దిగగానే నీటిగుంటలో మునిగిపోయాడు. ఆంజనేయులు ఎంతకూ పైకిరాకపోవడంతో చెరువుగట్టుపై నిలుచున్న వారు ఆందోళన చెంది గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు నీటిలోకి దిగి ఆంజనేయులు మృతదేహాన్ని తీశారు. మృతి చెందిన ఆంజనేయులుకు భార్య సంతోష, కొడుకు దుర్గా ప్రసాద్, కూతురు అక్షయ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...