గీతంలో ఘనంగా సాహితీ వేడుకలు


Sat,September 7, 2019 11:43 PM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : సమాజంలో నెలకొన్న కులతత్వ పరిస్థితులపై నిర్వహించిన జోయా ప్రదర్శన ఆహుతులను అలరించింది. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో సాహితీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో జోయా ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. విద్యార్థులు సామాజిక వర్గాల వేషధారణలో ఆకర్షించారు. సమాజంలో నెలకొన్న కులతత్వ పరిస్థితులను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రదర్శనలో కథానాయకురాలు ముస్లిం తండ్రిగా వ్యవహారించిన చిన్మయి రూట్రే తన ప్రదర్శనతో అందరినీ ఆకర్షించాడు. ఓ ఆడబిడ్డ తండ్రిగా సమాజంలో మెలగాల్సిన పాత్రను ప్రదర్శించి ఇట్టే ఆకట్టుకున్నాడు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...