నేత్రదానం మహాదానం


Fri,September 6, 2019 11:18 PM

అందోల్, నమస్తే తెలంగాణ: నేత్రదానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాలని సరోజినీదేవి కంటి దవాఖాన మాజీ సూపరింటెండెంట్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎస్.రవీందర్‌గౌడ్ అన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా శంకర నేత్రాలయం (బల్కంపేట), జోగిపేట లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో అందోలు, జోగిపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అందోలు, జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో పోటీల్లో గెలుపొందిన విజేతలలో విద్యార్థులు వినయ్, స్పందన, శ్రీహర్షిత, రాధిక, భవానీ, లావణ్య, దేవిక, కీర్తనలతో పాటు మరో 11 మంది విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్రదానం మహాదానం, మానవుడి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవని, అలాంటి కండ్లను మరణానంతరం ఇతరులకు ఉపయోగపడే విధంగా నేత్రదానం చేయాలన్నారు.

శంకర నేత్రాలయం తరపున తాను ఇప్పటివరకు 30 వేల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించానని, వేలాది మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశానని తెలిపారు. కంటి సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సకారాలను ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మనాభరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్యరాణి, ఉపాధ్యాయులు రమేశ్, రాధిక, కవితి, సరిత, మానా, కొండల్, సూర్యప్రకాశ్, ఆషమ్, పీఈటీ విబీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...