నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం


Fri,September 6, 2019 11:18 PM

పుల్కల్: గురుపూజోత్సవం సందర్భంగా మండలంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 15 మంది ఉత్తమ ఉపాద్యాయులను ఎంపిక చేశామని మండల విద్యాధికారి అంజయ్య తెలిపారు. జోగిపేటలో శనివారం జరుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ వారిని సన్మానిస్తారని తెలిపారు. ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులు జి.కృష్ణారెడ్డి (హెచ్‌ఎం చౌటకూర్), ప్రతిమాగౌడ్ (హైస్కూల్ శివ్వంపేట), స్వప్న (హైస్కూల్ గొంగ్లూర్), సుదర్శనం (చౌటకూర్ హైస్కూల్), చెన్న కేశ్వర్ (హైస్కూల్ పుల్కల్), రాజు (హైస్కూల్ పెద్దారెడ్డిపేట), దయాకర్ (పీఎస్ సింగూర్), భాస్కర్ (పీఎస్ సుల్తాన్‌పూర్), వినోద (పీఎస్ చౌటకూర్), కవిత (పీఎస్ కోడూర్), దేవిప్రియ (పీఎస్ మిన్‌పూర్), శివచందర్ (పీఎస్ పోచారం), మమత (పీస్ లాల్‌సింగ్‌నాయక్ తండా), నాగాగౌడ్ (పీఎస్ గొంగ్లూర్)లను ఎంపిక చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు జోగిపేటలో సన్మానకార్యక్రమం ఉంటుందని ఎంఈవో తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...