తెగిపడిన విద్యుత్ తీగలు తృటిలో తప్పిన ప్రమాదం


Fri,September 6, 2019 11:18 PM

వట్‌పల్లి: విద్యుత్ తీగలు తెగిపడి తృటిలో ప్రాణాపాయం తప్పింది. శుక్రవారం మండల కేంద్రం వట్‌పల్లిలో కూరగాయల సంత జరుగుతున్న సమయంలో ఎంపీడీవో కార్యాలయం ముందున్న విద్యుత్ స్తంభం వద్ద మంటలు చెలరేగి విద్యుత్ తీగలు తగి కూరగాయల దుకాణాలపై తెగిపడ్డాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తీగలు దుకాణాలు, రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన ట్స్రాన్స్‌కో సిబ్బంది తీగలను రోడ్డుపై నుంచి తొలిగించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...