జోగిపేటలో ఘనంగా జర్నలిస్టుల డే


Fri,September 6, 2019 11:17 PM

అందోల్, నమస్తే తెలంగాణ: జర్నలిస్టుల దినోత్సవాన్ని శుక్రవారం జోగిపేటలో ఘనంగా నిర్వహించారు. జోగిపేట జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీణాతో కలిసి రోగులకు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పర్జా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు అంకిత భావంతో పనిచేస్తారన్నారు. సమాజ మార్పు కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల పవన్ కుమార్, నాయకులు భగత్, ప్రదీప్‌గౌడ్, మహేశ్, కుమార్, శ్రీనివాస్, అశోక్‌గౌడ్, రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...