కిలిమంజారోపై తారా జువ్వ


Fri,September 6, 2019 11:17 PM

సంగారెడ్డి చౌరస్తా: మొత్తం మీద శ్యాంప్రసాద్ అనుకున్నది సాధించాడు. తన పట్టుదలను గుర్తించి సర్కార్ అందించిన సహకారానికి సార్థకత చేకూరింది. ప్రపంచంలో ఎత్తైన పర్వతం కిలిమంజారోను గురువారం అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్యాంప్రసాద్ టాంజానియాలోని కిలీమంజారో పర్వతారోహణకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి పర్వతారోహణకు పేదరికం అడ్డురావడంతో ప్రభుత్వమే అతడి ప్రయాణానికి కావాల్సిన పూర్తి సహకారం అందించిన విషయం తెలిసిందే. కలెక్టర్ హనుమంతరావు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్‌ను ఒప్పించడం ద్వారా శ్యాంప్రసాద్‌కు రూ.2 లక్షల చెక్కును అందించడంతో పాటు మిగతా మొత్తాన్ని జిల్లా అధికారుల సంఘం నుంచి అందించారు.

ఈ క్రమంలో టాంజానీయ బయలుదేరిన శ్యాంప్రసాద్ కిలిమంజారో పర్వ తం అధిరోహించి ఔరా అనిపించారు. ఆగస్టు 31న హైదరాబాద్ నుంచి టాంజానియా బయలుదేరిన శ్యాంప్రసాద్ ఈ నెల 5న కిలిమంజారో పర్వతం అధిరోహించాడు. ఈ నెల 8న హైదరాబాద్ చేరుకోనున్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు కిలిమంజారో పర్వతారోహకుడు శ్యాంప్రసాద్‌ను అభినందించారు. అదేవిధంగా తారా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రముఖర్జీ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ అనుకున్న లక్ష్యా న్ని చేరుకున్న విద్యార్థిని అభినందించారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థి కిలిమంజారో అధిరిహించడం సంతోషంగా ఉన్నదన్నారు. శ్యాం మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాక్షించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...