గిరిజన విద్యార్థికి ఘనస్వాగతం


Fri,September 6, 2019 11:17 PM

సంగారెడ్డి చౌరస్తా: గ్లోబల్ వలంటీర్‌షిప్ కార్యక్రమంలో భాగంగా 45 రోజుల పాటు ఈజిప్టు వెళ్లివచ్చిన గిరిజన విద్యార్థికి ఘనస్వాగతం లభించింది. సంగారెడ్డిలోని ప్రభుత్వ గిరిజన గురుకుల సంక్షేమ డిగ్రీ కళాశాలలో బీకాం హానర్స్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్.నరేష్ ప్రభుత్వ సహకారంతో ఈజిప్టు వెళ్లాడు. అక్కడ 15 రోజుల పాటు ఉండి ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాడు. కార్యక్రమంలో భాగంగా ఇక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులతో పాటు ఆచార వ్యవహారాలను వివరించారు. అదేవిధంగా ఈజిప్టు ప్రాంతంతో పాటు కార్యక్రమంలో పాల్గొన వివిధ దేశాల వాతావరణ పరిస్థితులతో పాటు వివిధ అంశాలను తెలుసుకున్నాడు. తాను తెలుసుకున్న అంశాలను గురుకుల విద్యార్థులతో నరేష్ పంచుకోనున్నారు. ఇదిలాఉండగా ఈజిప్టు నుంచి తిరిగి వచ్చిన నరేష్‌ను కళాశాల ప్రిన్సిపల్ అచ్చుతమ్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో బస్టాండ్‌కు ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు. నరేష్‌ను కళాశాల వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

అనంతరం ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు అతడిని ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి ఆర్డీవో శ్రీను నరేష్‌కు శాలువా, పుష్పగుచ్చాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కళాశాలతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డీసీవో గంగాధర్ మాట్లాడుతూ ఈజిప్టుకు వెళ్లి విద్యను బోధించే అవకాశం తమ కళాశాలకు రావడం చాలా గర్వంగా ఉన్నదన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అచ్చుతమ్ మాట్లాడుతూ తండాలో జన్మించిన బిడ్డలను ప్రపంచ దేశాలకు వెళ్లే అవకాశం కల్పించిన గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేష్ తల్లిదండ్రులను అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ హరిత, పూర్వ విద్యార్థి పూల్‌సింగ్‌నాయక్, స్వేయిరో వెస్ట్‌జోన్ కార్యదర్శి సునీల్, న్యాయవాది విజయరాజ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...