ఎరువులకు కొరత లేదు


Fri,September 6, 2019 12:18 AM

-రైతులు అధైర్యపడొద్దు
-అడిగినంత యూరియా సరఫరా చేస్తాం
-తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
-సొసైటీల ద్వారా యూరియా పంపిణీ
-జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు

కొండాపూర్ : రైతులకు ఎరువుల కొరతలేదని, రైతులు అడిగినంత ఎరువులను సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహ్మారావు తెలిపారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ గోదాం, సొసైటీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నామన్నారు. గొల్లపల్లి సొసైటీలో 660, మారెపల్లి సొసైటీలో 450, మల్కాపూర్ సొసైటీలో 250, కొండాపూర్ సొసైటీలో 450 చొప్పున బుధవారం సొసైటీ కార్యాలయాలకు యూరియాను పంపిణీ చేశామన్నారు. రైతులకు అవసరమైనంత ఎరువులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎరువుల కొరత ఉందనే అపోహాలను రైతులు నమ్మొద్దన్నారు.

కొంతమంది రైతులు యూరియా దొరకడంలేదంటూ బస్తాలకు బస్తాలు కొనుగోలు చేసి దాచి పెడుతున్నారని, అలాంటి అపోహాలు లేకుండా ఎంతమేరకు అవసరమున్నదో అంతనే కొనుగోలు చేసుకుని పంటలకు వాడుకోవాలని సూచించారు. రైతులకు ఎట్టి పరిస్థితులలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎరువుల పంపిణీ చేస్తుందన్నారు. అనంతరం సొసైటీలలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలలో యూరియా నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు మనోహర, మండల వ్యవసాయాధికారి ప్రతిభ, సొసైటీ సీఈవో మధుసూదన్‌రెడ్డి, మల్కాపూర్ సొసైటీ చైర్మన్ వీరేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...