ప్రజా సమస్యల పరిష్కారానికే పురపాలక వాణి


Fri,September 6, 2019 12:15 AM

అందోల్, నమస్తే తెలంగాణ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను ప్రజలు నుంచి తెలుసుకునేందుకు గురువారం నిర్వహించిన పురపాలక వాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జోగిపేటలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 18 రకాల సమస్యలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అందోలు-జోగిపేటలోని పలు వార్డుల్లో దోమల బెడద ఎక్కువైందని, మం దును పిచికారి చేయాలని ఎజాస్, రవీందర్, సత్యనారాయణలు దృష్టికి తీసుకువచ్చారు. కాలనీల్లో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు కోసం తవ్విన రోడ్లు వర్షం కారణంగా చెడిపోయాయని, వాటికి మరమ్మతులను చేయించాలని, కొత్తగా రోడ్లను వేయాలంటూ ఫిర్యాదులు వచ్చాయి.

పట్టణంలోని 4, 6,7,8,11వ వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, నీటి సమస్యను పరిష్కరించాలని బబ్లూ, చెన్న య్య అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మిర్జా ఫసహాత్ అలీబేగ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను ప్రజలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు పురపాలకవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పురపాలక వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్‌వో అంజన్‌కుమార్, బిల్ కలెక్టర్ రవీందర్ ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...