పల్లె ప్రగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి


Fri,September 6, 2019 12:15 AM

రాయికోడ్ : పల్లె ప్రగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేకాధికారి బాబురావు అన్నారు. గురువారం మండల కేంద్రం రాయికోడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండలస్థాయి అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శిలతో సమావేశంలో బాబురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నేటి నుంచి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ స్వరూపాన్ని మార్చేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. 30రోజుల ప్రణాళికతో అన్ని గ్రామాలు ఆదర్శంగా గ్రామాలు తీర్చిదిందాలన్నారు. కార్యక్రమంలో మండలస్థాయి, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్టీవెన్‌నిల్, ఉప తహసీల్దార్ కిష్టయ్య, అధికారులు అవినాష్‌వర్మ, స్వరూపారాణి, నర్సింహులు, తహ, రషీద్ పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...