కన్నీటి వీడ్కోలు..


Wed,September 4, 2019 11:11 PM

-అధికార లాంఛనాలతో ముత్యంరెడ్డి అంత్యక్రియలు
-అంతిమయాత్రకు హాజరైన ప్రముఖులు
-కన్నీరు మున్నీరైన తొగుట-తుక్కాపూర్ ప్రజలు
-ఆయన ప్రాణంగా భావించిన పొలంలోనే కార్యక్రమం

దుబ్బాక, నమస్తే తెలంగాణ/తొగుట/దుబ్బాక టౌన్: దుబ్బా క నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అంత్యక్రియలు అశేష అభిమానుల అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో బుధవా రం మధ్యాహ్నం నిర్వహించారు. చెరుకు ముత్యంరెడ్డి ప్రాణ ప్రదంగా భావించే ఆయన ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు చేశారు. ముత్యంరెడ్డి పెద్ద కూతురు జ్యోతి మంగళవారం రాత్రి అమెరికా నుంచి తొగుటకు చేరుకున్నారు. ముత్యంరెడ్డి పార్థివ దేహాన్ని ఆత్మీయుల సందర్శనార్థం తొగుట, తుక్కాపూర్ గ్రా మాల్లో ప్రధాన వీధుల గుండా తీసుకెళ్లారు. అనంతరం తొగుటలోని ఆయన నివాసం వద్ద పార్థివ దేహానికి అంతిమ కార్యక్రమాలు చేశారు.

తొగుట నుంచి తుక్కాపూర్ వ్యవసాయ క్షే త్రం వరకు వేలాది అభిమానుల కన్నీటి పర్యంతం మధ్య పా ర్థీవ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. సుమారు 4 గంటల పాటు ముత్యంరెడ్డి అంతిమయాత్ర కొనసాగింది. తమ అభిమాన నాయకుడు ఇక లేడంటూ దారి పొడువునా కన్నీరు ము న్నీరుగా విలపించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అంత్యక్రియల వద్ద అభిమానులు, ముఖ్య నాయకు లు ఎక్కువ సంఖ్యలో రావడంతో వారికి అవసరం మేర బారీకేడ్లు ఏర్పాటు చేసి, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు నిర్వహించే చోట టెంట్, కుర్చీలు వేశారు.

అధికారిక లాంఛనాలతో..
కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, సీపీ జోయల్ డెవిస్ ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో ముత్యంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు ముత్యంరెడ్డి పార్థివ శరీరానికి గౌరవ వందనం చేసి గాలిలోకి మూడు సార్లు తూటాలు పేల్చి ముత్యంరెడ్డికి గౌరవ నివాళులర్పించారు. ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి కర్మకాండ నిర్వహించారు.

ప్రముఖుల హాజరు
ముత్యంరెడ్డి అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియలు మొదలు నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మా, మాజీ మంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, వాకిట సునితా లకా్ష్మరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, ఎల్లు రవీందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, మడుపు భూంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు హాజరై, నివాళులర్పించారు.

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ఇందరా శోభన్, జేసీ శరత్, డీసీపీ నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్‌రెడ్డి, బండి నర్సాగౌడ్, మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ గాల్‌రెడ్డి, నాయకులు మురళీధర్ యాదవ్, పాల సాయిరాం, యాదవరెడ్డి, దర్పల్లి చంద్రం, శ్రీనివాస్‌గౌడ్, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, బానాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్‌లు పాగాల కొండల్‌రెడ్డి, చిక్కుడు చంద్రంతో పాటు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...