విద్యార్థి పుట్టిన రోజున నాలుగు మొక్కలను నాటాలి


Wed,September 4, 2019 11:08 PM

అందోల్, నమస్తే తెలంగాణ: ప్రతి విద్యార్థి తన జన్మదినం రోజున నాలుగు మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని తాలెల్మ మాజీ సర్పంచ్ మాణిక్యంగౌడ్ అన్నారు. బుధవారం తాలెల్మలో ఆయన జన్మదిన సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామానికి చెందిన యువజన సంఘాలు, పెద్దలతో కలిసి గ్రామ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడంమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...