విద్యార్థులకు బట్టల పంపిణీ


Wed,September 4, 2019 11:08 PM

రాయికోడ్: ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్య బోధన చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టిందని ప్రధానోపాధ్యాయుడు డి.విఠల్ అన్నారు. బుధవారం మండల కేంద్రం రాయికోడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ చేశారు. అనంతరం హెచ్‌ఎం డి.విఠల్ మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు పుస్తకాలు, రెండు జతల బట్టలు, మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం మన విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలో ప్రతి ఒక్కరికీ సీట్లు వచ్చాయన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులకు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, శివకుమార్, శ్రావణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...