సాదుల్లానగర్‌లో విషాదఛాయలు


Wed,September 4, 2019 11:08 PM

హత్నూర: మండలంలోని సాదుల్లానగర్ గ్రామానికి చెందిన తల్లీకొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాదుల్లానగర్ చెందిన దండు అశోక్ తన భార్య అనిత (25), కొడుకు దీక్షిత్(2)తో కలిసి బుధవారం ద్విచక్రవాహనంపై మెదక్ జిల్లా చేగుంట వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండల కేంద్రం శివంపేట పోలీస్‌స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వచ్చి లారీ ఢీకొనడంతో అశోక్ భార్య అనిత, కొడుకు దీక్షిత్ అక్కడికక్కడే మృతిచెందగా అశోక్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అశోక్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా తల్లీకొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడం తెలుసుకున్న సాదుల్లానగర్ గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...