భెల్‌లో మోగిన ఎన్నికల నగారా..

Wed,September 4, 2019 11:08 PM

రామచంద్రాపురం: భెల్‌లో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 14వ తేదీన భెల్ పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. భెల్‌లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. గెలుపే ధ్యేయంగా కార్మిక సంఘాలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించి అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఒక్కరోజులోనే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపును నిర్వహించారు. కార్మిక శాఖ అధికారులు నామినేషన్ల పరిశీలన చేసి ఆయా కార్మిక సంఘాలకు గుర్తులను కేటాయించారు. ఆయా కార్మిక సంఘాలు గేట్ మీటింగ్‌లను నిర్వహించుకోవడానికి తేదీలను ఖరారు చేశారు. భెల్‌లో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా కార్మిక సంఘం యూనియన్ నాయకులు కార్మికులతో సమావేశమవుతున్నారు.

ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రశాంతంగా కన్పించే భెల్ పరిసరాల్లో ఇప్పుడు కార్మిక సంఘం ఎన్నికల వేడి మొదలైంది. కార్మికులను మచ్చిక చేసుకోవడానికి ఆయా గుర్తింపు సంఘాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి సమయం ఎక్కువగా లేకపోవడంతో బరిలో నిలిచిన నాయకులు ఇప్పటికే ప్రచార పర్వం మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, భెల్ యాక్టివ్ రియల్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ, భెల్ వర్కర్స్ యూనియన్, భెల్ కార్మిక సంఘం, ఐఎన్‌టీయూసీ, బీయూఈటీయూసీలు పోటీల్లో ఉన్నాయి. ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో మొత్తం 1791మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...