వర్షపు నీటిని ఒడిసిపట్టాలి


Sun,August 25, 2019 01:46 AM

న్యాల్‌కల్ : జలశక్తి అభియాన్ పథకంపై శనివారం మండలంలోని గ్రామాల్లో ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. కలెక్టర్, పంచాయతీ అధికారి, డ్వామా అధికారులు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జలశక్తి అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి వనరులను పొదుపుగా ప్రతిఒక్కరూ వాడుకోవాలని సూచించారు. భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు ఉపాధిహామీ పథకం కింద ఫాంపౌండ్స్, పర్కులేషన్ ట్యాంకులు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలను నిర్మించుకోవచ్చాన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మద్యం విక్రయించొద్దని ఝరాసంగం : మద్యం అమ్మినా, విక్రయించినా జరిమాన చెల్లించాలని గ్రామసభలో గ్రామస్తులంతా కలిసి తీర్మానించారు. శనివారం కొల్లూర్ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో సర్పంచ్ సావిత్రీబస్వరాజ్‌పాటిల్ అధ్యక్షతన జరిగింది. మద్యం విక్రయించినా వారికి రూ.5వేలు, కొనుగోలు చేసి వ్యక్తికి రూ. వెయ్యి చొప్పున జరిమాన చెల్లించాల్సి ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీరాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...