గ్రామాల్లో వైద్యసేవలందించడం అభినందనీయం


Sun,August 25, 2019 01:45 AM

కోహీర్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కవేలి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జీబీ గార్డెన్ స్మారకార్థం కేఫా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం శుభ సూచకమన్నారు. అన్ని రకాల వైద్యసేవలందించడం అభినందనీయమన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం నిరుపేదలకు ఎంతగానో మేలు చేస్తున్నారని వివరించారు.
ఆర్థికంగా స్థిరపడిన ప్రతిఒక్కరూ నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కవేలి గ్రామానికి చెందిన లావణ్య తన భర్త దుర్గయ్యగౌడ్ చనిపోయాడని తనను ఆదుకోవాలని ఎమ్మెల్యే మాణిక్‌రావుకు విన్నవించింది. డబుల్ బెడ్‌రూం, అంత్యోదయ కార్డును మంజూరు చేయించాలని విన్నవించింది. స్పందించిన ఎమ్మెల్యే లావణ్యను ఆదుకుంటామని హామీనిచ్చారు. డా.హేమలత, హైకోర్టు న్యాయవాది సుధాకర్, జీవరత్నం, ఏసురత్నం, జడ్పీటీసీ రాందాస్, సర్పంచ్ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మొగులయ్య పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...