సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా పనిచేస్తాం


Sun,August 25, 2019 01:45 AM

గుమ్మడిదల: సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా పని చేస్తామని సర్పంచ్ చిమ్ముల దీపానరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.. శనివారం మండలంలోని అనంతారం గ్రామపంచాయతీ సమావేశ మందిరంలో సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి గ్రామస్తులతో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అండాలమ్మ, ఉపసర్పంచ్ స్వరూప, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని రక్షించుకుందాం
గుమ్మడిదల: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారాన్ని విజయవంతం చేసి పర్యావరణ రక్షణకు పాటుపడుదామని సర్పంచ్ పిలుపునిచ్చారు. శనివారం అనంతారం గ్రామంలో సర్పంచ్ దీపానరేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ స్వరూప, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు, ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలు నాటి రక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.
చిట్కుల్‌లో గ్రామసభ
పటాన్‌చెరు రూరల్ : మండలంలోని చిట్కుల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జలశక్తి అభియాన్‌లో భాగంగా సర్పంచ్ నీలం మధుముదిరాజ్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంజయ్, ఎంపీటీసలు మంజుల, మాధవి, ఉపసర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, పుష్పలత, లక్ష్మి, సుగుణ, గౌరీ పాల్గొన్నారు.
జిన్నారం మండలంలో..
జిన్నారం: జిన్నారం, మంగంపేట గ్రామాల్లో శనివారం గ్రామసభలు నిర్వహించారు. జిన్నారంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలశక్తి అభియాన్‌పై చర్చించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంజీవ, కార్యదర్శి యాదగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు. మంగంపేట గ్రామసభ రసాభాసగా మారింది. మాజీ సర్పంచ్ కోళ్లఫాం నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తుపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రశాంతినరేందర్, ఉపసర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...