హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి


Sun,August 25, 2019 01:44 AM

రామచంద్రాపురం : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి, తెల్లాపూర్ హరితహారం ప్రత్యేకాధికారి మాణిక్ అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపలిటీ పరిధిలోని జ్యోతిరావు ఫులే కాలనీలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో రోడ్డుకు ఇరువైపులా అధికారులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో ప్రతిఒక్కరూ మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. రాష్ర్టాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ మట్టయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకుంటాం
పటాన్‌చెరురూరల్ : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకొని మండలాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని పటాన్‌చెరు జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్ కార్యాలయంలో వివిధ రాష్ర్టాల ప్రతినిధులు, ఎన్‌జీవోలు, జడ్పీటీసీ ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు ముగిశాయి. తరగతుల్లో భాగంగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం, గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేకాధికారులతో శిక్షణను ఇచ్చారు. ఎన్‌ఐఆర్‌డీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధిక రాస్తోగి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డికి శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేశారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...