అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి


Sun,August 25, 2019 01:43 AM

వట్‌పల్లి: ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరిస్తే గ్రామంలో మౌలికవసతులను సమకూర్చుకోవచ్చని ఎంపీడీవో రఘు అన్నారు. శనివారం మండలంలోని కేరూర్‌లో సర్పంచ్ నాగమణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలందరూ అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలన్నారు.
ఇంటింటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని అందుకు ప్రభుత్వం రూ. 12వేలు అందజేస్తుందన్నారు. అదే విధంగా ఇంకుడుగుంతలు నిర్మించుకుని భూగర్భజలాల పెరుగుదలకు కృషి చేయాలన్నారు. పలువురు గ్రామస్తులు గ్రామంలోని పలు సమస్యలను ప్రజలు సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్యని పరిష్కరించాలని, పారిశుధ్యం లోపించకుండా జాగ్రతలు తీసుకోవాలని, వీధుల్లో స్తంభాలకు లైట్లను అమర్చాలని కోరారు. కార్యక్రమంలో ఐకేపీ, అంగన్‌వాడీ, ఆశవర్కర్లు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...