32 బైక్‌లు, ఒక ఆటో సీజ్


Sun,August 25, 2019 01:41 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: శుక్రవారం రాత్రి నారాయణఖేడ్ పట్టణంలో డీఎస్పీ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహాంకాళీనగర్, ఈత్వార్‌పేట్‌ల్లో ఇంటింటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 32 బైక్‌లు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు.అదే విధంగా 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టారు. అనంతరం డీఎస్పీ సత్యనారాయణరాజు మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందస్తుగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. కార్డన్ సెర్చ్‌లో ఇద్దరు సీఐలు, సబ్ డివిజన్ పరిధిలోని 10మంది ఎస్‌ఐలు, 8మంది ఏఎస్‌ఐలు, 6గురు హెడ్‌కానిస్టేబుళ్లు, 80మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...