చెత్త ఆటోలకు బ్రేక్


Sun,August 25, 2019 01:40 AM

అమీన్‌పూర్ : అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్యనగర్ చెత్త డంపింగ్‌యార్డులో చెత్త వేయొద్దని నవ్యకాలనీ వాసులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్త డంపింగ్‌పై పలుమార్లు కమిషనర్ వేమనరెడ్డితో విన్నవించినా ఏమా త్రం పట్టించుకోవడం లేదని అరోపించారు. అందుకే తామే స్వయంగా చెత్త ఆటోల వారిని ఇక్కడ చెత్త వేయవద్దని వేడుకుంటున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది సర్ది చెప్పడంతో అక్కడి నుంచి తరలివెళ్లారు. కార్యక్రమంలో పలు కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...