విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగాలి


Sat,August 24, 2019 01:41 AM

-గురుకుల విద్యార్థుల రాణింపు కోసమే టీ10 క్రికెట్ టోర్నమెంట్
-జిన్నారం గిరిజన గురుకుల పాఠశాలలో టీ10 క్రికెట్ టోర్నీని ప్రారంభించిన
-గురుకులాల ప్రిన్సిపల్ సెక్రెటరీడాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
-అలరించిన విద్యార్థుల న్యత్యాలు

జిన్నారం: గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులను జాతీయస్థాయి క్రీడల్లో రాణించేవిధంగా ప్రోత్సహించేందుకు గురుకుల విద్యార్థులకు టీ10 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించామని గురుకులాల ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా జిన్నారం గురుకుల పాఠశాలలో రీజనల్ వారీగా టీ10 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు రీజనల్ వారీగా జిన్నారం గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించిన టీ10 క్రికెట్ టోర్నీకి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. అనంతరం బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు. అంతకుముందు వివిధ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాటలు, డ్యా న్సులు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. జంగంమెట్ గురుకుల విద్యార్థులు తబలా వాయించిన తీరుకు ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ మంత్రముగ్దులై తన సీటులోంచి లేచి వచ్చి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ తండా, ఖమ్మం కోయిగూడ తండా, మన్ననూరుతో పాటు మారుమూల తండాలకు చెందిన విద్యార్థులు జాతీయ క్రికెట్‌లో చోటు సంపాదించుకోవాలనే క్రికెట్ టోర్నీ ప్రారంభించామని తెలిపారు. ఇందు కోసం నాలుగు క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేశామన్నారు.
బాలు ర కోసం రెండు, బాలికల కోసం రెండు అకాడమీలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో అకాడమీని రూ.30లక్షలతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ రాష్ర్టాల నుంచి అధికారులు వచ్చి క్రికెట్ అకాడమీలను చూసి వెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే, 22 సోషల్ వెల్ఫేర్, 22 ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేశామన్నారు. చదువే ముఖ్యం కాదని, ఆటలు కూడా చాలా ముఖ్యమని తెలిపారు. ఇలాంటి క్రికెట్ టోర్నీని వేదికగా తీసుకొని అవకాశాలను వినియోగించుకొని జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. సెలబ్రిటీలుగా గురుకుల విద్యార్థులు ఎదుగాలన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో మనవారు 215 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఈ సంవత్సరం ఐదు వందలకుపైగా విద్యార్థులు ఐఐటీకి వెళ్లారని చెప్పారు. ఉపాధ్యాయులు, కోచ్‌లు సలహాలు, సూచనలు చేస్తారని, మనమే స్వయం కృషితో ఎదుగాలని సూచించారు. జిన్నారం గురుకుల పాఠశాల మంచి ప్రదేశంలో ఉందని, హైదరాబాద్ నగరంలో ఇలాంటి పాఠశాల లేదని మీరు దృష్టవంతులన్నారు. గురుకుల పాఠశాలలకు అవసరమైన ఇతర సౌకర్యాలను కల్పించేందుకు బడ్జెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యంకాదని, గెలిచేది ఎవరో ఒక్కరే అని ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ అన్నారు.

బ్యాటింగ్, బౌలింగ్‌తో అలరించిన ప్రవీణ్‌కుమార్..
టీ10 క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవంలో గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విద్యార్థుల్లో ఉత్సా హం నింపారు. అనంతరం బ్యాటింగ్.. బౌలింగ్‌తో విద్యార్థులను అలరించారు. క్రీడలు గెలువాలన్నా తపనను నింపుతాయన్నారు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటిని చూసి భయపడి పట్టుదలను మాత్రం వదొలద్దన్నారు. కార్యక్రమంలో గురుకులాల డిప్యూటీ సెక్రెటరీ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, దిలీప్‌కుమార్, గురుకులాల స్పోర్ట్స్ అధికారి ఎం.రమేశ్‌కుమార్, రీజనల్ కో-ఆర్డినేటర్ రమేశ్, తహీసల్దార్ రామ్మోహన్, సర్పంచ్ లావణ్యశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, ప్రిన్సిపాల్ గంగాధర్, ఉపసర్పంచ్ సంజీవ, వివిధ రీజియన్ల పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...