పుస్తకాలు విద్యార్థులకు నేస్తాలు


Sat,August 24, 2019 01:20 AM

పుల్కల్: పుస్తకాలు విద్యార్థులకు నేస్తాలని రూంటూరీడ్ సంస్థ చైర్మన్ గీత అన్నారు. మండల పరిధిలోని ముదిమాణిక్యం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రీడింగ్ క్యాంపేయిన్ కార్యక్రమం నిర్వహించారు. రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంస్థ లైబ్రెరీ కోచ్ గీత మాట్లాడుతూ గ్రామీణ పాఠశాలల్లో గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకరావడానికి తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం 700 పుస్తకాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, సర్పంచ్ పడమటి అరుణ, ఉప సర్పంచ్ చంద్రారెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నగేశ్, టీపీటీయూ అధ్యక్షుడు నూలి శ్రీధర్, రిటైర్డు ఎంఈవో విశ్వనాథం,ప్రధానోపాధ్యాయుడు తారాసింగ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...