నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి


Sat,August 24, 2019 01:20 AM

అందోల్, నమస్తే తెలంగాణ: హరితహారం కార్యక్రమంలో ప్రతి విద్యార్థి తమ ఇండ్ల వద్ద ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా మొక్కలను నాటాలని అందోలు జడ్పీటీసీ ఖాదిరాబాద్ రమేశ్ అన్నారు. శుక్రవారం జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపీపీ బాలయ్య, ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం ద్వారా వాతావరణం కలుషితం కాకుండా ఉంటుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. మొక్కలను నాటడమే కాదు, వాటిని బతికించుకునే బాధ్యతను కూడా తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శివరాజు, ఎన్‌సీసీ అధికారి నరోత్తమ్‌కుమార్, ఉపాధ్యాయులు విశ్వేశ్వర్, అజిత్, ప్రసాద్, అనిల్ కుమార్, మంజ్యానాయక్, కృష్ణయ్య, రామాగౌడ్, ఆశయ్య, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

రాయికోడ్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇటిక్యాపల్లి , ఖామ్‌జమల్‌పూర్ గ్రామా శివారుల్లో రోడ్డుకు ఇరువైపుల ఎంపీపీ మొక్కలు నాటి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు అధికారులు, గ్రామాల్లోని ప్రజలు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటేందుకు రైతులు, ప్రజలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్, ఎంపీడీవో స్టీవేన్‌నీల్, పశువైద్యాధికారి డా.పాండ్యన్, ఉపాధిహామీ అధికారులు గురుపాదం, విజయ్‌కుమార్, సర్పంచ్‌లు విఠమ్మ, నరేశ్‌కుమార్, నాయకులు కిష్టరెడ్డి, సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు గౌసోద్దీన్, సంగమేశ్వర్, బాలయ్య పాల్గొన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి: మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగుడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జడ్పీటీసీ అపర్ణశ్రీకాంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్ సూచించారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా భూత్కుర్ గ్రామంలో సర్పంచ్ కళావతి, ఎంపీటీసీ ఇందిరాబాయితో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలన్నారు. హరితహారంలో ప్రజలు భారీగా చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శివాజీరావు, నాయకులు బస్వరాజ్, రాజేందర్‌రావు, సంగమేశ్వర్, మధు, వినోద్, వీఆర్వో రామలింగం పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...