జల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలి


Sat,August 24, 2019 01:19 AM

న్యాల్‌కల్ : భావితరాల బంగారు భవిష్యత్ కోసం నీటిని పొదుపు చేయాలని, జలసంరక్షణ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని కేంద్ర జలశక్తి అభియాన్ బ్లాక్ నోడల్ అఫీసర్ కృష్ణ కిషోర్ అన్నారు. శుక్రవారం మండలంలోని హద్నూర్ గ్రామ శివారులోని ఊటచెరువుతోపాటు రేజింతల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీటీ పనులను కేంద్ర జలశక్తి అభియాన్ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలవనరులను సంరక్షించడమే లక్ష్యంగా కేంద్రప్రభు త్వం జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయన్నారు. నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు ఉపాధిహామీ పథకం కింద ఫాంపౌండ్స్, పర్కులేషన్ ట్యాం కులు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలను నిర్మించుకోవచ్చాన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు జలసంరక్షణను బాధ్యతగా చేపట్టాలని, జలసంరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి అభియాన్ టెక్నికల్ అఫీసర్ పన్నీర్ సెల్వం, డ్వామా ప్రాజెక్టు జిల్లా అధికారి శ్రీనివాస్, ఏపీడీలు ఎల్లయ్య, రాజు, ఇరిగేషన్ డిప్యూ టీ ఈఈ ఉదయ్‌శంకర్, రూరల్ డెవలప్‌మెంట్ జేఈఈ ఎక్బాల్ అహ్మద్, ఎంపీడీవో రాజశేఖర్, ఏపీవో రంగారావు, ఈసీ హన్మంతు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...