హరితహారాన్ని విజయవంతం చేయాలి


Sat,August 24, 2019 01:18 AM

మునిపల్లి: తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీటీసీ పైతర మీనాక్షిసాయికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం మునిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు, మండలంలోని సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ మండలంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందుకు సంబంధిత అధికారులు, సర్పంచ్‌లు గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండలంలో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి జయరామ్‌విజయ్, వ్యవసాయాధికారి శివకుమార్, ఎంఈవో దశరథ్, ఏపీవో సంతోశ్, ఏపీఎం భాగయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...