ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలి


Sat,August 24, 2019 01:18 AM

వట్‌పల్లి: దుద్యాల శివారులోని సర్వేనెంబర్ 85లో లక్షల రూపాయాల విలువైన భూమిని కొంత మంది వ్యక్తులు కబ్జా చేశారని దాన్ని కాపాడి నిరుపేదలకు పంపిణీ చేయాలని గ్రామస్తులు శుక్రవారం డిప్యూటీ తాసిల్దార్ అశోక్‌కు వినతి పత్రం అందజేశారు. 85 సర్వేనెంబర్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రి మనోహ్మన్‌సింగ్ తమకు పట్టాలు అందజేశారని వారు తెలిపారు. కానీ తమకు దక్కాల్సిన భూముల్లో ఆశ్రమం స్థాపించి భూములను కబ్జా చేసి సాగు చేస్తున్నారని అధికారులు స్పందించి కబ్జా దారులపై చర్యలు తీసుకుని తమ భూములు తమకు దక్కేలా చూడాలన్నారు.
భూములు తమకు దక్కకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని రైతులు హెచ్చరించారు.కార్యక్రమంలో రేగోడ్ మాజీ ఎంపీపీ పత్రి విఠల్, రైతులు ఆశయ్య, విఠల్, డాకయ్య, ముకుందం, రాములు, మాణిక్యయ్య, పద్మయ్య, శంకరయ్య, రాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...