చిన్నారిపై లైంగికదాడికియత్నంనిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: డీఎస్పీ శ�


Sat,August 24, 2019 01:17 AM

కొండాపూర్: చిన్నారులపై ఎక్కడో ఒక చోట లైంగికదాడియత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఇటీవల 9నెలల చిన్నారి లైంగికదాడి ఘటన తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొండాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చిన్నారిపై లైంగికదాడియత్నం ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకున్నది. సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నీళ్లు తాగేందుకు వాటర్ ట్యాంకు వద్దకు మూడున్నరేండ్ల చిన్నారి వచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన పాపయ్య అలియాస్ యోహాన్ (35)చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం రావడంతో హుటాహుటీన గ్రామానికి చేరుకుని చిన్నారికి వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించామని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...