వట్‌పల్లిలో ఎరువుల దుకాణాల తనిఖీ


Sat,August 24, 2019 01:16 AM

వట్‌పల్లి: మండల కేంద్రం వట్‌పల్లిలోని ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి మహేశ్‌చౌహాన్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి ఎరువుల నిలువలు, ధరల పట్టికలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి దుకాణంలో ఎరువులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. దుకాణాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. అనంతరం దుకాణాల్లోని ఎరువుల విక్రయాల రికార్డులను పరిశీలించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...