ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు


Sat,August 24, 2019 01:16 AM

జహీరాబాద్,నమస్తే తెలంగాణ : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జహీరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కుర్మయాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. గొల్ల కురుమ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. విద్యార్థులు రాధా కృష్ణ వేషధారణ రూపంలో విద్యార్థిని, విద్యార్థులు శోభాయాత్రలో పాల్గొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి మండలంలోని గొల్ల కురుమ యాదవ్ సంఘం నాయకులు వేడుకలో పాల్గొన్నారు. సుభాష్ గంజ్‌లో కురుమ యాదవ సంఘం సమావేశం నిర్వహించి, సాంస్కృతి కార్యక్రమలు నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని డాక్టర్ ఆర్‌ఎల్‌ఆర్ పాఠశాలలో చైర్మన్ లకా్ష్మరెడ్డి, మాణిక్‌ప్రభు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..
జహీరాబాద్‌లో గొల్ల కురుమ యాదవ సంఘం వారు నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొన్నా రు. సుభాష్ గంజ్‌లో నిర్వహించిన వేడుకల్లో వారు పాల్గొని డోలు వా యించారు. శ్రీకృష్ణ శోభాయాత్రల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణ వేషధారణలో ఉన్న చిన్నారులతో కలసి ఫొటోలు దిగిన్నారు. కార్యక్రమంలో గొల్ల కురు మ సంఘం నాయకులు, జి.గుండ ప్ప, ఎంపీటీసీ, టీఆర్‌ఎస్ నాయకులు ఎంజీ.రాములు, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

కోహీర్‌లో..
కోహీర్ : మండలంలోని కోహీర్ శిశుమందిరం, విశ్వభారతి, బిలాల్‌పూర్ ప్రాథమిక పాఠశాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణలతో కోలాట, చెక్క భజనలు, నృత్యం చేశారు. అనంతరం ఉట్టిని పగులగొట్టి అందులో ఉన్న ప్రసాదాన్ని పంచిపెట్టారు. చిన్నారులు చేపట్టిన సంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో శిశుమందిర్ అధ్యక్షుడు పాపిరె డ్డి, సిద్ధన్న, బస్వరాజ్, సుదర్శన్, రాఘవులు, శ్రీనివాస్, శైలజ, సంగమేశ్వర్, దేశ్‌పాండే, వెంకట్‌రావు, శర్మ, సురేశ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

న్యాల్‌కల్‌లో..
న్యాల్‌కల్ : మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టామి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హద్నూర్‌లోని ప్రధాన వీధుల గుండా వివేకానంద బాల సంస్కర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికాల వేషధారణతో ఉన్న చిన్నారులు నృత్యాలు, ఆటపాటలతో ఊరేగింపు చేపట్టారు. అలాగే అమీరాబాద్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో స్వామివారికి అభిషేకం తదితర పూజ చేసి భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో వివేకనంద సంధ్య పాఠశాల నిర్వహకులు మహేశ్, అనిల్‌కుమార్, నర్సింహ్మారెడ్డి, మాణిక్, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగంలో..
ఝరాసంగం : మండల పరిధిలోని కృష్ణాపూర్ అంగన్‌వాడీ-2 కేంద్రంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఆటపాటలు ఆడు తూ శ్రీకృష్ణుడు వేసిన వేషధారణలో హారిక, నిశాంత్, శివా ని, మున్నజా ఫాతిమా, శివకుమారులు చిన్ని కృష్ణుడు, రుక్మిణి వేషధారణ ఆకట్టుకుంది. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ సాయిగీత తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...