వేతన సంబురం

Fri,August 23, 2019 12:37 AM

-సర్పంచ్‌లకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
-పాత, కొత్త సర్పంచ్‌లకు అందనున్న వేతనాలు
-జిల్లా పంచాయతీ అధికారి ఖాతాలో జమ
-పాత వారికి 4 నెలలు, కొత్తవారికి 5 నెలల బకాయిలు
-జిల్లాలో 647 పంచాయతీలకు రూ.2.56కోట్ల నిధులు విడుదల
- హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ: గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉండే వారినే ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకొని సేవలు అందిస్తారని నమ్ముతారు. గ్రామంలో ప్రథమ పౌరుడుగా సర్పంచ్‌కు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. నిరంతరం గ్రామస్తుల మధ్య ఉండి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే వారికి ప్రజలు పట్టం కట్టారు. అలాంటి వారితో ప్రజాసేవ చేయించి ప్రభుత్వ పాలనను గ్రామస్థాయిలో అమలు చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ ప్రభుత్వం సర్పంచ్‌లకు అప్పగించింది. విశేష అధికారాలు కల్పిస్తూ గ్రామ నిర్ణేత సర్పంచ్ అని సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలని దృఢసంకల్పంతో గౌరవ వేతనాన్ని సర్పంచ్‌లకు అందిస్తున్నది. జిల్లాలో తండాలు, మధిర గ్రామాలను పంచాయతీలుగా సీఎం కేసీఆర్ చేసిన అనంతరం 647 పంచాయతీలు గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో నూతన సర్పంచ్‌లు కొలువుదీరారు. అంతకుముందు 457 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు జనవరి వరకు పదవీ బాధ్యతలు నిర్వహించిన విష యం తెలిసిందే. సర్పంచ్‌ల గౌరవ వేతనాలు కొన్ని నెలలుగా బకాయిలు ఉండడంతో పాత సర్పంచ్‌లకు నాలుగు నెలల బకాయిలు, కొత్త సర్పంచ్‌లకు ఐదు నెలల గౌరవ వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 11తేదీన సర్పంచ్‌లకు గౌరవ వేతనాలు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు రూ. 2.56కోట్లు జిల్లా పంచాయతీ అధికారి ఖాతాలో జమ అయ్యాయి. దీంతో ప్రభుత్వం సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర..
గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర అని గుర్తించి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారు. జిల్లాల విభజన అనంతరం 457 గ్రామ పంచాయతీలతో జిల్లా విస్తరించి ఉండగా, సీఎం కేసీఆర్ మధిర గ్రామాలు, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించి నూతనంగా 190 పంచాయతీలను ఏర్పాటు చేశారు. 500 జనాభా ఉన్న మధిర గ్రామాలు, తండాలు పంచాయతీలుగా ఏర్పాటు చేసుకొని జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొత్త సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేస్తూ పాలనపరమైన చర్యలు తీసుకొని గ్రామాలను అభివృద్ధి దిశలో తీర్చిదిద్దుతున్నారు.
పంచాయతీ ఖాతాలలో వేతనాలు జమ..
ప్రభుత్వం విడుదల చేసిన సర్పంచ్‌ల గౌరవ వేతన నిధులను గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమచేసేందుకు ట్రెజరీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచ్‌లకు ప్రభు త్వం గౌరవ వేతనాలు రూ.5వేలకు పెంచిన విషయం తెలిసిందే. సర్పంచ్‌లు గ్రామస్తుల సమస్యలతోపాటు అభివృద్ధికి విడుదల చేసే నిధులు వృథాకాకుండా సద్వినియోగం చేసుకొని బాధ్యతగా పని చేయడానికి దోహదపడుతున్నది. సర్పంచ్‌లు గ్రామస్తుల సమన్వయంతో ఉమ్మడి ఆలోచనలతో అత్యవసరమైన పనులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ నిధులను ఖర్చుపెడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.

గ్రామాలకు పచ్చతోరణం..
సీఎం కేసీఆర్ పట్టుదలతో అడవుల పెంపకానికి కృషి చేస్తూ పొలంగట్లు, ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలతో పాటు గ్రామాలకు పచ్చనితోరణంలా కనిపించేందుకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించారు. గ్రామాలను దత్తత తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలతో చర్చించి నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు ట్రీగార్డులను ఏర్పాటు చేసే బాధ్యతను యాజమాన్యాలకు అప్పగించారు. దీంతో గ్రామాల్లో హరితహారం పచ్చతోరణంలా వెల్లువిరుస్తున్నది. ప్రతి ఇంటి ముందు కుటుంబ యజమానులు ఆరు మొక్కలు నాటి సంరక్షించి చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సర్పంచ్‌లు బాధ్యతను గుర్తించి హరితహారాన్ని పొంపొందిస్తున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...