గ్రామసభలను నిర్వహించాలిఎంపీడీవో వెంకట్‌రెడ్డి


Fri,August 23, 2019 12:11 AM

కోహీర్ : మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించాలని ఎంపీడీవో వెంకట్‌రెడ్డి కోరారు. గురువారం కోహీర్ పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ భూగర్భజలాలను పెంచేందుకు గానూ గ్రామసభల్లో నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి నిల్వ కట్టల నిర్మాణంపై చర్చించాలని కోరారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఈ నెల చివరి నాటికి వందశాతం పూర్తి చేసి స్వచ్ఛ భారత్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...