రాచన్నస్వామి ఆలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన


Fri,August 23, 2019 12:09 AM

కోహీర్ : మండలంలోని బడంపేట రాచన్నస్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా లక్ష బిల్వార్చనను గనంగా నిర్వహించారు. గురువారం శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకొని గర్భగుడిలో వీరభద్రావతారంలో ఉన్న రాచన్నస్వామికి రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి తదితర పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయావరణలో ప్రతిష్ఠించిన శివలింగానికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. సహస్ర నామాలను పఠిస్తూ శివలింగానికి మారెడు పత్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈవో శివరుద్రప్ప, జగదీశ్వర్‌స్వామి, శివానంద్, శివమూర్తిస్వామి, భుజంగం, భక్తులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...