బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్


Fri,August 23, 2019 12:08 AM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు నందీశ్వర్‌గౌడ్ బీజేపీలో చేరారు. గురువారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నందీశ్వర్‌గౌడ్, తన అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు సదాశివపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ఏ రామాగౌడ్ సైతం బీజేపీ గూటికి చేరారు. నందీశ్వర్‌గౌడ్ బీజేపీ పార్టీలో చేరడంతో పటాన్‌చెరులో పార్టీ బలోపేతం అవుతుందని లక్ష్మణ్ అన్నారు. నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు సాధారణ కార్యకర్తలా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఆశీష్‌గౌడ్, బీజేపీ పటాన్‌చెరు శ్రేణులు పాల్గొన్నాయి.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...