విజిలెన్స్ దాడుల్లో పట్టుబడ్డ బియ్యం


Fri,August 23, 2019 12:07 AM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : ముత్తంగి రింగు రోడ్డుపై టోల్‌గేట్ వద్ద బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్, అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పటాన్‌చెరు డిప్యూటీ తహసీల్దార్ మదన్ ఆధ్వర్యంలో ఔటర్ రింగురోడ్డుపైన ఉన్న టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖిల్లో శంషాబాద్ నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం, కొంపల్లి వైపు నుంచి వస్తున్న ఐషర్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రెండు వాహనాల్లో కలిపి 131 క్వింటాళ్ల బియ్యం అధికారులకు పట్టుబడింది. వాహనంతో పాటు నిందితులు శంషాబాద్ నివాసి అయిన ఎండీ నిజాముద్దీన్ (38), గోల్కొండకు చెందిన సయ్యద్ ఫైజ్ (30)లను పట్టుకోగా పటాన్‌చెరు పోలీసులు వారిని అరెస్టు చేశారు. రేషన్ దుకాణాలకు తరలించాల్సిన సబ్సిడీ బియ్యాన్ని నగరంలో సేకరించి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బార్గా, బీదర్‌లకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. రూ.6కు ప్రజల వద్ద రేషన్ బియ్యం కొనుగోలు చేసి రూ.12కు బ్లాక్ మార్కెట్‌లో వ్యాపారులు అమ్ముకుంటున్నారని విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ముత్తంగి సివిల్ సైప్లె గోదామ్‌కు అధికారులు తరలించారు. కార్యక్రమంలో పటాన్‌చెరు సీఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...