రసవత్తరంగా టీ-10 క్రికెట్ టోర్నీ


Fri,August 23, 2019 12:07 AM

జిన్నారం : జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న టీ-10 క్రికెట్ టోర్నీ రసవత్తరంగా జరుగుతోంది. ఈ టోర్నీలో రాష్ట్రంలోని తొమ్మిది రీజియన్ల నుంచి తొమ్మిది జట్లు పాల్గొన్నాయి. బుధవా రం ప్రారంభమైన లీగ్ మ్యాచ్‌లు రెండో రోజు కూడా జరిగాయి. గురువారం మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. అదిలాబాద్, కరీంనగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అదిలాబాద్ జట్టు 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, నల్గొండ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నల్గొండ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. రంగారెడ్డి, భూపాలపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. కరీంనగర్, మెదక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మెదక్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. నల్గొండ, భద్రాది కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నల్గొండ 38 పరుగుల తేడాతో గెలిచింది. భూపాలపల్లి, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భూపాలపల్లి 18 పరుగుల తేడాతో గెలిచింది. అదిలాబాద్, మహబూబ్‌నగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 30 పరుగుల తేడాతో గెలిచింది. భద్రాది కొత్తగూడెం, భూపాలపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భద్రాది కొత్తగూడెం రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డులను అందజేశారు. మ్యాచ్‌లను ప్రిన్సిపాల్ గంగాధర్, పీఈటీలు పర్యవేక్షించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...