తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అందోలు ప్రజలకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విజ


Fri,August 23, 2019 12:06 AM

అందోల్, నమస్తే తెలంగాణ: సింగూర్ జలాలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మకూడదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు. సింగూర్ జలాలు అందోలు నియోజకవర్గానికి ఇవ్వకుండా నిజామాబాద్‌కు సరఫరా చేస్తున్నారని కొందరూ కావాలనే ప్రజలను తప్పుదదోవ పట్టించిందుకే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తున్నారని ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సింగూర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు. నియోకజవర్గానికి కాకుండా ఇతర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారంటూ రాజకీయ దురుద్ధేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పుడు పోస్టులు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని అయన సూచించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...