మొక్కల సంరక్షణ అందరి బాధ్యత


Fri,August 23, 2019 12:05 AM

హత్నూర: హరితహారంలో నాటిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మహిళా అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఇన్‌చార్జి రాజ్‌కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని రెడ్డిఖానాపూర్ గ్రామంలో హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నాటిన మొక్కలు భవిష్యత్ తరాలవారికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయని తెలిపారు. మహిళలు, విద్యార్థులు ఇండ్ల వద్ద ఖాళీస్థలాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వనజావీరేశం, హెచ్‌ఎం మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...