మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత


Fri,August 23, 2019 12:04 AM

పుల్కల్: ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని పుల్కల్ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి అన్నారు. గురువారం మండల కేంద్రం పుల్కల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మత్స్యకారుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. గ్రామంలోని చెరువులు నిండిన తర్వాత ఉచిత చేప పిల్లలను వదులుకుందామని పేర్కొన్నారు. అంతకు ముందు పుల్కల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కమిటీ అధ్యక్షుడిగా మన్నె చంద్రయ్య, ఉపాధ్యక్షుడిగా సొంగ వెంకటేశం, కార్యదర్శిగా బెస్త శ్రీనివాస్, డైరెక్టర్‌లుగా కంబాలపల్లి హరి, కనిగేరి దత్తు, బోయిని దామోదర్, పిట్ల యాదయ్య, కాశ విజయ్‌కుమార్, ఆకుల రాజు ఎన్నికకైనారు. కార్యక్రమంలో మత్స్య సహకారశాఖ అధికారి అస్మా, సంఘం నాయకులు మహేశ్‌బాబు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...