కోహీర్‌లో మోస్తరు వర్షం


Fri,August 23, 2019 12:02 AM

కోహీర్ : మండల కేంద్రంతో పాటు కవేలి, దిగ్వాల్, చింతల్‌ఘట్, కొత్తూర్, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లి, మద్రి, గురుజువాడ, రాజనెల్లి, బిలాల్‌పూర్ తదితర గ్రామాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. ఓ వారం నుంచి వానలు కురియకపోవడంతో రైతులు నిరాశకు లోనయ్యారు. కానీ గురువారం కురిసిన మోస్తరు వర్షానికి రైతన్నలు సంతోషంగా ఉన్నారు. తమ పంటల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా కోహీర్ పట్టణంలోని బ్యాంకు సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థులు వర్షపు నీటితో ఇబ్బందులు పడ్డారు.
న్యాల్‌కల్‌లో..
న్యాల్‌కల్ : మండలంలోని పలు గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మండలంలోని రేజింతల్, మిర్జాపూర్(బీ), గంగ్వార్, హద్నూర్, న్యామతాబాద్ తదితర గ్రామాల్లో మధ్యాహ్నం పూట భారీ వర్షం కురిసింది. మండలంలో సాగు చేసిన పత్తి, జొన్న, కంది, పెసర, మినుము, సోయాబీన్ తదితర పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...