నీలినాలుక వ్యాధి లక్షణాలు..


Fri,August 23, 2019 12:02 AM

ఈ వ్యాధి వైరస్‌తో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కవగా సోకుతుంది. వ్యాధి సోకిన జీవాల ముక్కు నుంచి రక్తం ధా రలుగా కారుతుంది. నోటి నుంచి సొంగ కారడంతో పాటు పెదవులు, చిగుళ్లు, నాలుక ఉబ్బుతాయి. నోటిపూతతో దుర్వాసన, నాలుకపై బొబ్బలు ఏర్పడతాయి, క్రమంగా నాలుక నీలిరంగులోకి మారుతుంది. దీంతో గొర్రెలు మేత మేయలేక బలహీనపడతాయి. వ్యాధి సోకిన గొర్రెలకు నాలుగైదు రోజుల్లో చికిత్స చేయించాలి, లేకుంటే అవి మృత్యువాత పడుతాయి. అలాగే ఈ వ్యాధి సోకిన గొర్రెలను ఈగలు, దోమలు కుట్టి ఇతర గొర్రెలను కుట్టడంతో ఇతర జీవాలకు సోకే ప్రమాదం ఉంది.
చికిత్స...వ్యాధి సోకిన జీవాలను గుర్తించిన వాటికి ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్‌తో మూతిని శుభ్రంగా కడగాలి. నోటిపై ఉన్న పుండ్లకు బోరిక్ ఫౌడర్, ఆయింట్‌మెంట్ రాయాలి. కాలిపై పుండ్లు ఏర్పడితే యాంటిసెప్టిక్ క్రీం రాయాలి. జీవాలు బలహీనపడకుండా గ్లూకోజ్, విటమిన్లు ఖనిజ లవణ మిశ్రమాన్ని గంజి, అంబలిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగించాలి. బీ కాంప్లెక్స్, యాంటిబయోటిక్ మందు లు వాడాలి. హోమియో మందును వ్యాధి సోకిన రోజు నుంచి 5 మిల్లీమీటర్ల చొప్పున రోజుకు మూడుసార్లు వేయాలి.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...