గడ్డితో జీవాలకు ముప్పు


Fri,August 23, 2019 12:01 AM

ఝరాసంగం : గొర్రెలు, మేకలు కాపరులు వర్షాకాంలో జీవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే మొలిచిన గ డ్డి తినడంతో వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉం టుం ది. జీవాలకు సోకే వ్యాధులు, వాటి లక్షణాలను గమనించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. ఆగస్టు నెలలో పరాన్నజీవులు కాలుష్యమైన మేత, నీటితో జీర్ణాశయం పేగులు, కాలేయంలో నులిపురుగులు చేరి జీవాలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. దీంతో ఆరోగ్యం క్షీణించడం తో పాటు విరేచనాలు, నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే వ్యాధుల బారినపడి చనిపోయే అవకాశముంది.

ముందస్తు జాగ్రత్తలు..గొర్రెలు, మేకలకు జూలైలోపే నట్టల నివారణ మందులు తాగించి ఆల్బెండజోల్, పెన్‌బండాజోల్ మాత్రలను వేయా లి. అలాగే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లెవమి సోల్, డిసెంబర్, జనవరి నెలల్లో తల వాపు మందు ఆక్సిక్లోజి నైడ్, లెవమిసోల్ మందులను ఇవ్వాలి.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...