క్షయ, కుష్ఠు వ్యాధులపై సర్వే


Thu,August 22, 2019 11:59 PM

సిర్గాపూర్ : కుష్ఠు, క్షయ వ్యాధులకు సంబంధించి రోగులను గుర్తించేందుకు బాధ్యతతో సర్వే ప్రక్రియ చేపట్టాలని సిర్గాపూర్ పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి(హెచ్‌ఈవో) షాహేద్ అన్నారు. గురువారం స్థానిక పీహెచ్‌సీలో సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26నుంచి వచ్చే సెప్టెంబర్ 12వ తేదీలోపు పీహెచ్‌సీ పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేపట్టాలని సూచించారు. ఒక్కో ఆశ కార్యకర్త వెంట వీవీతోపాటు గ్రామంలో రోజుకు 20ఇండ్లు తిరిగి ముమ్మరంగా సర్వేను బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. కుష్టు, క్షయ వ్యాధుల భారీ నుంచి వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు సర్కారు తగు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఏ రాంచందర్, ఏఎన్‌ఎం, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...