సీనియర్ సిటిజన్లకు ఎమ్మెల్యే సన్మానం


Thu,August 22, 2019 11:58 PM

నారాయణఖేడ్, నమస్తేతెలంగాణ : వరల్డ్ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పలువురు సీనియర్ సిటిజన్లను సన్మానించారు. ఇందులో భాగంగా రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ వెంకట్రామ్‌రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం బాధ్యులు కాటెపల్లి మల్లయ్య, నర్సింహులు, వెంకటేశం తదితరులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. జీవితంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొని అపారమైన అనుభవాన్ని కూడగట్టుకునే సీనియర్ సిటిజన్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...