విద్యార్థి తల్లిదండ్రులకు సన్మానం


Thu,August 22, 2019 11:57 PM

నాగల్‌గిద్ద : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని స్వేరీస్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ అన్నారు. నాగల్‌గిద్దలోని స్వేరీస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యధిక జీపీఏ సాధించిన పూర్వ పేద విద్యార్థి సిద్ధంగర్ రాజు తల్లిదండ్రులు భీమప్ప, అంజమ్మను గురువారం ఘనంగా సన్మానించి రూ.5వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...