హరితహారం మొక్కలకు నీరు


Thu,August 22, 2019 11:55 PM

సిర్గాపూర్ : మండల పరిధిలోని పెద్ద ముబారక్ గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు గురువారం సర్పంచ్ దిగంబర్, పంచాయతీ కార్యదర్శి భార్గవి నీళ్లు పోయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు పోయించామని అన్నారు. సర్కారు రూపొందించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులమంతా కృషి చేస్తున్నామని సర్పంచ్ దిగంబర్ తెలిపారు.
కడ్పల్ ఎంపీపీఎస్‌లో...
మండల పరిధిలోని కడ్పల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక హెచ్‌ఎం భూమయ్య ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో కొత్తగా మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో టీచర్లు ధర్మేంద్ర, శివకుమార్‌స్వామి, ధౌర్యనాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.

17
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...