మెరుగైన చికిత్సలు అందించాలి


Wed,August 21, 2019 11:05 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : సర్కార్ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్సలు చేసేందుకు వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాంరెడ్డి తెలిపారు. బుధవారం జహీరాబాద్ ఏరియా దవాఖానను పరిశీలించి, వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జహీరాబాద్ ఏరియా దవాఖాన జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులు, రోగులు దవాఖానకు వచ్చే అవకాశం ఉంటుందని, అత్యవసర చికిత్సలు వెంటనే చేయాలని ఆదేశించారు. దవాఖానలో వైద్యులు అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలన్నారు. దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.

చర్యలు తీసుకుంటాం..
జహీరాబాద్ సర్కార్ దవాఖానలో అత్యవరస సమయంలో అందుబాటులో ఉండని, వైద్యులు, సిబ్బం ది పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శా ఖ డిప్యూటీ కమిషనర్ జయరాం చెప్పారు. రోగులకు చికిత్స అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫిర్యాదు చేశారు. అలాగే కొందరూ వైద్యు లు దవాఖానలో ఉండవాల్సిసిన సమయంలో ప్రైవే టు దవాఖానలో ఉంటున్నారని ప్రజలు ఫిర్యాదులు చేయడంతో వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దవాఖానలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగులకు సౌకర్యలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాని వైద్యులకు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...