పోరాట యోధుడు సర్వాయి


Mon,August 19, 2019 12:11 AM

-బహుజనుల హక్కుల కోసం పోరాడిన పాపన్న
-గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి
-సర్దార్ సర్వాయి పాపన్నకు ఘననివాళి
-బహుజనుల కోసం పోరాడిన పాపన్న
-జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి
సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమానికి ఈత, తాటి వనాలను పెంచి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న 369వ జయంతిని జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్నగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ హాజరై పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో చైర్ పర్సన్‌ను శాలువా కప్పి సర్దార్ పాపన్న చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహుజనుల కోసం పోరాడి రాజు అయ్యాడని, సర్వాయి పాపన్న పోరాట పటిమను గుర్తు చేశారు. ముఖ్యంగా దోపిడీ, అంటరానితనం, స్త్రీలను గౌరవించడం కోసం అహర్నిశలు శ్రమించి పోరాడిన ఘనత పాపన్నకే దక్కిందన్నారు. పాపన్న సమిష్టి వ్యవసాయం కోసం 12వేల అరకలతో పోరాటం చేసి భూములను పేదలకు పంచిన ఘనత దక్కించుకోవడం సంతోషకరమన్నారు.

నేటితరం యువకులు పాపన్న చరిత్రను చదువుకుని సమాజానికి సేవ చేయడంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గీత కార్మికులకు చేతినిండా పని ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ హరితహారంలో ఈత, తాటి చెట్ల పెంపకం కోసం కృషి చేస్తుందన్నారు. భవిష్యత్తులో గౌడ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. సర్వాయి సర్దార్ పాపన్న జయంతిని పురస్కరించుకుని గౌడ కులస్తుల కోరిక మేరకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజుగౌడ్, జడ్పీటీసీలు సునీతా మనోహర్‌గౌడ్, రమేశ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎంపీటీసీలు ఈశ్వర్‌గౌడ్, సంతోశ్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు అమర్‌నాథ్‌గౌడ్, ప్రతాప్‌గౌడ్, లింగంగౌడ్, రమేశ్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...